రామలకోట ఫీల్డ్ అసిస్టెంట్ ని వెంటనే తొలగించాలి…

 

రామలకోట ఫీల్డ్ అసిస్టెంట్ ని వెంటనే తొలగించాలి…

గ్రామ సభలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

వెల్దుర్తి జూన్ 19 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన జాతీయ ఉపాధి హామీ పథకం నందు విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ను వెంటనే తొలగించాలని సోమవారం జరిగిన గ్రామ సభలో గ్రామస్తులు సామాజిక తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెల్దుర్తి మండలంలో నిర్వహిస్తున్న 16వ రౌండ్ సామాజిక తనిఖీలో భాగంగా రామళ్లకోట గ్రామంలో సోమవారం ఉపాధిహమీ పనులకు సంబంధించి గ్రామ సర్పంచ్ నిర్మల అధ్యక్షతన గ్రామ సభను సోషల్ ఆడిట్ అధికారులు నిర్వహించారు. 14.2022 నుంచి 313.2023 వరకు జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ అధికారులు గ్రామంలో సామాజిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో గ్రామసర్పంచ్ నిర్మల, వైకాపా నాయకులు మాధవస్వామి, గ్రామస్తులు గొల్ల ఆంజనేయులు, ఎం. పార్థుడు, ప్రసాద్, రాజు, వెంకటేశ్వర్లు, స్వాములు, బి.టి. నాయుడు, మద్దిలేటి, గ్రామ పెద్దలు, ప్రజలతో కలిసి సోషల్ ఆడిట్ అధికారులకు

వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలో ఉపాధిహమీ పనులను ఒకే ఫీల్డులసిస్టెంట్ గత 15 సంవత్సరాలుగా ఉపాధి పనులు

చేయిస్తున్నాడన్నారు. అయితే అతను ఒక వర్గానికి మాత్రమే పనులు కల్పిస్తున్నారని ఆరోపించారు. దీంతో గ్రామంలో గొడవలు జరిగే పరిస్థితులు

ఉన్నాయన్నారు. జాబ్కార్డు లేని వారికి జాబ్కార్డు ఇప్పించేందుకు ఒక్కొక్కరి దగ్గర రూ.1 వెయ్యి వసూలు చేస్తున్నారని, అదేవిధంగా ఉపాధికూలీల చెల్లింపులో

ఇప్పించుకుంటున్నాడని వారు ఆరోపణలు చేశారు. గ్రామంలో దాదాపుగా రూ.1.90 లక్షల ఉపాధిపనులు జరిగినట్లు అధికారుల ద్వారా తెలిసింది. మరిన్ని ఆధారాలతో ఓపెన్ ఫోరంలో ఫిర్యాదు చేస్తారని సమాచారం. తమ గ్రామ ఉపాధిహమీ ఫీలు అసిస్టెంట్ను తొలగించాలని డ్వామా పిడికి గ్రామసర్పంచ్, గ్రామస్తులు వ్రాసుకున్న ఫిర్యాదు లేఖను సోషల్ ఆడిట్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ రాజునాయక్, టిఏ రాజశేఖర్, డిఆర్పి ఓబులేసు, గ్రామస్తులు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!