• గ్రామ స్వరాజ్యం దిశగా వైసిపి ప్రభుత్వ సంక్షేమ పాలన అదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం -ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.

 

 

 

– గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యులు కె.భాగ్యలక్ష్మి.

. అల్లూరి జిల్లా, జీ మాడుగుల (అఖండ భూమి), వెబ్ న్యూస్ :

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దశగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పాలన సాగుతోందని పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో అర్హత ఒక్కటే ప్రామాణికంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోందని ఆమె చెప్పారు. జి. మాడుగుల మండలం వంతల గ్రామ సచివాలయం పరిధిలోని చింతగొంది, గట్రాయి, సిరిపురం గ్రామాలలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 98 గడపలను శాసనసభ్యులు సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై *భాగ్యలక్ష్మి ఆరా తీశారు. అర్హత ఉండి కూడా ఇప్పటికీ పెన్షన్లు పొందని వారు ఉంటే వారు ఏ విధంగా సంక్షేమ పథకాల పొందాలన్న దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ…గడపగడపకూ తిరుగుతున్న క్రమంలో నిత్యం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పదవులకు పరిమితం కాకూడదు వారు సేవకులుగానే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్టుగానే తామంతా పనిచేస్తున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలో ప్రతి సమస్యను తెలుసుకోవడం వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలతో నిత్యం మమేకం అయ్యేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిగిలిన పార్టీల వారు కూడా వైయస్సార్సీపీకి మద్దతు తెలిపే వారి సంఖ్య క్రమేణా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లంకెల కళ్యాణ్ , వైస్ ఎంపీపీ కే సత్యనారాయణ, గెమ్మెలి సర్పంచ్ ఎస్ కొండబాబు, లువ్వాసింగి ఎంపిటిసి జి సన్యాసి దొర, సచివాలయం కన్వీనర్ పి మహేష్ బాబు, పి రమణమూర్తి, గృహసారధులు మాధవి రాణి, సింహాచలం, వార్డు మెంబర్ వంగల రాజులమ్మ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వి. బాలకృష్ణ, కే. వెంకటేష్ పడాల్,ఐ రాంబాబు, టి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!