మెయిన్ రోడ్డును అనుకొని ఉన్న వైన్ షాపును తొలగించండి కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు

 

 

 

నర్సీపట్నం టౌన్ నర్సీపట్నం మున్సిపాలిటీ 24వ వార్డు దనిమిరెడ్డివీధిలో మెయిన్ రోడ్డును అనుకొని ఉన్న వైన్ షాపును తొలగించాలని స్థానిక వార్డు కౌన్సిలర్ దనిమరెడ్డి మధు స్పందన కార్యక్రమంలో ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మధు మాట్లాడుతూ గిరిజన బాలికల హాస్టల్ మరియు పాఠశాల ఆవరణంలో వైన్ షాపు ఉండడంతో విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్న మందుబాబులు బాలికలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అక్కడ ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని అక్కడ నుండి తరలించాలని కోరారు నర్సీపట్నం కృష్ణ దేవి పేట ప్రధాన రహదారిలో ఉండడం నిత్యం అనేకమంది ఈ మార్గం ద్వారా ప్రయాణాలు చేస్తూ ఉంటారని మందుబాబులు ప్రయాణికులను కూడా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తున్నారని ప్రభుత్వ నిబంధనలు ప్రకారంగా గుడి బడి ప్రభుత్వ కార్యాలయాలకు ఆసుపత్రులకు 100 అడుగుల దూరంగా ఉండాలని నియమాలను ఇక్కడ ఉల్లంఘించారని దుకాణానికి దగ్గరలోనే ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం మరియు మాంటిస్పోరి పబ్లిక్ స్కూల్ ఉన్నందున్న అవి 100 అడుగుల లోపే ఉన్నట్లు స్థానికులు గుర్తించారని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహానికి ఎదురుగా కూర్చొన్ని అక్కడే మందుబాబులు వేళాపాల లేకుండా విచ్చలవిడిగా తాగుతూ బాలికలు కాలేజీలకు వెళ్తూ వస్తున్నప్పుడు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు అలాగే పక్కనే ఉన్న పబ్లిక్ స్కూల్ పిల్లలను చదువుకోవడానికి తీసుకువస్తున్న తల్లిదండ్రులు ముఖ్యంగా మహిళలపై మందు బాబులు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని అక్కడ నుండి షాపు తరలించుటకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆర్డీవోను కోరినట్లు తెలియజేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!