దుర్గంధంలో 14 వ వార్డు..
పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు…
ఇబ్బందుల్లో వార్డు ప్రజలు
వెల్దుర్తి జూన్ 21 అఖండ భూమి వెబ్ న్యూస్ : వెల్దుర్తి పట్టణంలో 14 వ వార్డు నందు దుర్గంధంలో వార్డు ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న కాలనీ
వాసులు. గ్రామపంచాయతీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధం వాసనకు వార్డు ప్రజలు రోగాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందులుగా పడుతున్నట్లు కాలనీ వార్డు ప్రజలు తెలుపుతున్నారు. మురికి కాలువలు సజావుగా కోకపోవడంతో వర్షపు నీరు ఎక్కువగా వచ్చేసరికి రోడ్లెక్కి ప్రవహించడంతో మురికి కాలువలోని దుర్గంధం, వాసన వెదజల్లుతున్నట్లు విశ్వనీయ సమాచారం గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కాలనీవాసులు రోగాల బారిన పడకుండా మురుగు కాలువల నీటిని సజావుగా మలించేందుకు వార్డు ప్రజలు కోరుతున్నారు.


