•ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘానంగా యోగ దినోత్సవం.

 

 

 

అల్లూరి జిల్లా, పాడేరు,అఖండ భూమి, వెబ్ న్యూస్ :

ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాడేరు శాఖ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవంని నిర్వహించడం జరిగింది ముందుగా విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు యోగ ఆసనాలు వేసి వేశారు ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (అరెస్సెస్) జిల్లా ప్రచారక్ శివరామకృష్ణ, మాట్లాడుతూ యోగ అనేది భారతీయ సనాతన దర్మంతో పాటు వస్తున్న పరంపర విద్య ఈరోజు మళ్ళీ యోగ యొక్క విశిష్టత భారతీయుల ద్వారా ప్రపంచ మొత్తానికి వ్యాపించడం జరిగింది. ఈ విద్యను అభ్యసిస్తూ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరు మానసికంగా,శారీరకంగా అభివృద్ధి చెందుతున్నారు మళ్ళీ భారతీయ విద్యలో యోగ విద్య పాఠశాలలో ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే భవిష్యత్తు తరాలు భారత దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నంత శిఖరాలు చేరుకోవడానికి దోహద పడుతుందని వారు అన్నారు.ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్, జిల్లా కన్వీనర్ గెమ్మెలి కళ్యాణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూజారి ఊపేంద్ర, పాడేరు భాగ్ కన్వీనర్ సీదరి వంశీ కృష్ణ, చింతపల్లి భాగ్ కన్వీనర్ పాంగి మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పాటిబోయిసూర్యారావు, గిరిజన విద్యార్థుల విభాగం జిల్లా కన్వీనర్ సీసా సత్తి బాబు, గిర్లీయ నాగార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!