యోగాతో ఆనందం ఆరోగ్యం పిలికింటన్ కంపెనీ యాజమాన్యం:
అచ్యుతాపురం జూన్ 21 అఖండ భూమి: ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా అచ్చుతాపురం పారిశ్రామిక షెజ్ లోని పిలికింటన్ కంపెనీలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ఉద్యోగులంతా నిత్యం యోగా సాధన చేసినట్లయితే శారీరక మానసికంగా ఆరోగ్యం ఉంటుందని దీని ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు .అనంతరం కార్మికులతో యోగాసనాలు అభ్యాసం చేయించారు. రుగ్వేద కాలం నుండి భారతదేశం ఈ ప్రపంచానికి యోగ విద్యను పరిచయం చేసి నేడు ప్రపంచం అంతా ఆమోదించి జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకునే విధంగా నేడు భారత ప్రభుత్వం కృషి చేసిందని దీనికి మనం భారతీయులుగా గర్వపడాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జి ఎం గారు సుకుమార్ గారు సేఫ్టీ మేనేజర్ లెనిన్ బాబు ప్రొడక్షన్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొన్నారు
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి


