తప్పిన రైలుప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్‌..

 

Lohit Express: తప్పిన రైలుప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్‌..

ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. మరో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్‌ నుంచి విడిపోయాయి..

అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో లోహిత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు పార్ట్ లుగా విడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర భమాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు నుంచి కిందికి దూకారు..

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలా – బీహార్‌లోని కిషన్‌గంజ్ మధ్య ఉన్న సూర్యకమల్ రైల్వే స్టేషన్ దగ్గరలో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంజన్‌ ముందుకు కదిలి వెళ్లిపోవడంతో.. దాదాపు పది కోచ్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన ఘటనాస్థలికి చేరుకుని ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను ఆపివేశారు.

అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్‌కు జతచేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే రైలు 16 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కప్లింగ్ వైఫల్యం కారణంగా రైలు కోచ్‌లు విడిపోయినట్లు తెలుస్తోంది. ఒరిస్సా రైలు ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా ట్రైన్ యాక్సిడెంట్స్ కు సంబంధించినవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ట్రైన్ లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!