గడప గడపకు.., జగనన్న సురక్షపై మొదలైన సీఎం జగన్‌ సమీక్ష

 

గడప గడపకు.., జగనన్న సురక్షపై మొదలైన సీఎం జగన్‌ సమీక్ష

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్ష ప్రారంభమైంది..

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.

జులై 1వ తేదీ నుంచి జరిగే జగనన్న సురక్షా కార్యక్రమంపైనా ఈ సమావేశంలోనే చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకురానుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. దాదాపు నెలపాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది..

Akhand Bhoomi News

error: Content is protected !!