దేశ రక్షణకు బిజెపిని సాగనంపాలి…

దేశ రక్షణకు బిజెపిని సాగనంపాలి.

సీపీఎం, సీపీఐ పార్టీల బహిరంగ సభలో వక్తలు.

 

అచ్చుతాపురం ఏప్రిల్ 28 అఖండ: భూమి సిపిఎం,సీపీఐ పార్టీల దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న “ప్రచార బేరి” కార్యక్రమంలో భాగంగా ఈరోజు అచ్యుతాపురంలో కే ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఎలమంచిలి నియోజకవర్గస్థాయి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అచ్చుతాపురం మండల సిపిఎం కార్యదర్శి రొంగలి రాము అధ్యక్షత వహించగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి ప్రభావతి మాట్లాడుతూ దేశంలో బిజెపి మోడీ విధానాలతో పేద అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని, అంబానీ, అదాని వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సహజ వనరులను తాకట్టుపెట్టి వారికి అప్పనంగా సమర్పించి భవిష్యత్ తరాలకు లేకుండా చేస్తున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి తొమ్మిదేళ్లగా ఉన్న ఉపాధికే ఎసరు పెట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి ఓడిస్తేనే ప్రజలకు దేశానికి రక్షణ అన్నారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చిన రేపుతూ మోడీ బిజెపి విధానాలు వ్యతిరేకించే వారిపై భౌతిక దాడులు, హత్య లు, హత్యాచారాలు నిర్బంధ చర్యలు ప్రయోగిస్తున్నారన్నారు. సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ ఈరోజు దేశంలో మోడీ ని తరిమికొట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ఉండే వైసీపీ మోడీ విధానాలకు పార్లమెంటులో చేతులెత్తి సమర్ధిస్తుందన్నారు. దీంట్లో భాగంగానే గంగవరం పోర్ట్ అమ్మకం, రైల్వే స్టేషన్ నమ్మకం, రైతులకు స్మార్ట్ మీటర్ల బిగింపు వంటి చర్లన్నీ అమలవుతున్నాయి అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రక్షిస్తామని అక్కడ ప్రైవేటీకరణ విధానాలకు పార్లమెంటులో చేతులెత్తుతున్నారని అన్నారు. చిత్తశుద్ధి లేకుండా రెండు నాలుగుల దారులతో రాష్ట్రంలో పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ యొక్క బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రుత్తల శంకర్రావు, వివి శ్రీనివాసరావు, ఆళ్ల మహేశ్వరరావు, ఎస్ బ్రహ్మాజీ, ఆర్ దేముడునాయుడు, సిపిఐ నాయకులు రాజాన దొరబాబు, మాధవరావు, సన్యాసిరావు, సిపిఎం నాయకులు సోమునాయుడు నాయకత్వం వహించారు. అచ్చుతాపురం లోని ఎంఆర్ఓ ఆఫీస్ మీదగా సంతబైలు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ సభ నిర్వహించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!