గురజాడ జన్మస్థలాన్ని సందర్శించిన సుబ్బారెడ్డి

గురజాడ జన్మస్థలాన్ని సందర్శించిన సుబ్బారెడ్డి

 

ఎస్.రాయవరం. ఏప్రిల్ 28. అఖండ భూమి

 

మండల కేంద్రం, మహాకవి గురజాడ జన్మస్థలం అయిన ఎస్.రాయవరం గ్రామాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి పర్యటించారు ఈ సందర్బంగా ఆయన గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన రచనలతో ప్రజలను జాగృతం చేసి , సమాజాన్ని మేల్కొలిపిన మన తెలుగుజాతి ముద్దుబిడ్డ మహాకవి గురజాడ అప్పారావు జన్మస్థలం సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అటువంటి మహనీయుడు పుట్టిన నేలపై నడయాడుతున్నందుకు గర్వంగా ఉందని, ఆయన అన్నారు. ఈయన వెంట పాయకరావుపేట శాసన సభ్యులు గొల్ల బాబురావు,అనకాపల్లి ఎంపీ డా.. భీశెట్టి సత్యవతమ్మ , ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట వైసీపీ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య,మాజీ ఎంపీపీ బోలిశెట్టి శారదా కుమారి, పార్టీ సీనియర్ నాయకులు కొణతాల శ్రీనివాస్, నూకి నాయుడు, శ్రీపతి రాజు,అల్లాడ నాగరాజు,పెద ఈశ్వర్రావు, మాతా గురునాధరావు,రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు,.

Akhand Bhoomi News

error: Content is protected !!