డోన్ సాయి శ్రీ డిగ్రీ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి..S.F.I………

 

డోన్ సాయి శ్రీ డిగ్రీ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి..S.F.I………

డిగ్రీలో సింగిల్ మేజర్ మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలి,త్రి మేజర్ విధానాన్ని అమలు చేయాలి..S.F.I డోన్

అఖండ భూమి జూన్ 22 డోన్ వెబ్ న్యూస్ :

డిగ్రీలో సింగిల్ మేజర్ మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలి,త్రి మేజర్ విధానాన్ని అమలు చేయాలి అని, కళాశాలలో అధ్యాపకులు రిక్రూట్మెంట్ కు, మేజర్ కోర్సుల్లో 15 సబ్జెక్టులు చదువుటకు 15 ల్యాబ్లు కావాలని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళిక నిరుద్యోగం అధికమించడం అని దీర్ఘకాల క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డోన్ మండల కార్యదర్శి తెలుగు విజయ్ కుమార్ కోరుచూ వీసీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం వారు

డోన్ లోని సాయి శ్రీ డిగ్రీ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగింది..

అనంతరం ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తెలుగు విజయకుమార్ మాట్లాడుతూ డోన్ లో ఉన్నటువంటి సాయి శ్రీ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని కాలేజీలో రెండు అంతస్తులు భవనం ఉన్నప్పటికీ ఎటువంటి సేఫ్టీ పాటించకుండా గ్రిల్ కూడా ఏర్పాటు చేయలేదని ఫైరింగ్కు ఎక్విప్మెంట్స్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని , ఈ కాలేజీలో వందల మంది విద్యార్థిని, విద్యార్థులు చదువుతున్నప్పటికీ వారికి ఆట స్థలం కానీ, మౌలిక వసతులు గాని, మరుగుదొడ్లు గాని, సరైనవి లేవని మరుగుదొడ్లకు సంబంధించి శానిటేషన్ కానీ చేయించడం లేదని అయినప్పటికీ విద్యార్థుల దగ్గరుండి వేలకు వేల రూపాయలు దోచుకుంటున్నారని, కళాశాలలను బుక్ స్టాల్ గా మారుస్తున్నారని, కాలేజీకి రాకపోయినా కూడా విద్యార్థిని విద్యార్థుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ హాజరు వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు..

వీటన్నిటి పై సమగ్ర విచారణ జరిపి సాయి శ్రీ డిగ్రీ కాలేజ్ పర్మిషన్ను రద్దు చేయాలని రాయలసీమ యూనివర్సిటీ వి. సి గారికి తెలియజేయడం జరిగిందని, ఈ కాలేజీ పై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో మధు, కార్తీక్, సునీల్, మాబు, సురేష్, మోహన్, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు……

Akhand Bhoomi News

error: Content is protected !!