మున్సిపాలిటీని గాలికి వదిలేసిన ఎమ్మెల్యే గణేష్ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర

 

నర్సీపట్నం మున్సిపాలిటీ ని ఎమ్మెల్యే గణేష్ గాలికి వదిలేసారని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజనా వీర సూర్యచంద్ర ఆరోపించారు గురువారం మున్సిపాలిటీలోని రెండవ వార్డులో వార్డు ఇంచార్జ్ మొండెం శివ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జన సైనికులతో కలిసి సూర్యచంద్ర ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పాటు జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు అనంతరం వార్డులో పర్యటించి వార్డు ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏ వార్డు చూసినా అధ్వానంగా చెత్తా చెదారంతో దర్శనమిస్తుందన్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు చెత్త టాక్టర్ కు డీజిల్ లేక చెత్త ఎత్తే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే గణేష్ ఎంతో ఆర్భాటంతో రూ 166 కోట్లతో ప్రారంభించిన ఇంటింటికి మంచినీటి పథకం పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు కాక ఎక్కడికి అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయారన్నారు నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు కావస్తున్న టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందించకపోవడం విచారకరమన్నారు రెండో వార్డు కౌన్సిలర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తనుకు అనుకూలమైన వారి ఇళ్ల వద్ద డ్రైనేజీ పనులు చేయిస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్న వారి ఇంటి వద్ద ఎటువంటి పనులు చేయించడం లేదని వార్డు ప్రజలు చెబుతున్నారని తెలిపారు ప్రశ్నించిన వారిపై కౌన్సిలర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీలను సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు నాతవరం మండలం నాయకులు వేగిశెట్టి శ్రీనివాసరావు కొండ్రు కళ్యాణ్  చిరంజీవి శ్రీను లంక పాత్రుడు మాకవరపాలెం నాయకులు కర్రీ సంతోష్ వాసం వెంకటేష్ బోయిన చిరంజీవి పోలుపర్తి సూరిబాబు కొప్పాక కళ్యాణ్ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!