రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి ఏజెన్సీ ఎంపీపీల సమస్యలు 

 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి ఏజెన్సీ ఎంపీపీల సమస్యలు

ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించిన ఎంపీపీల సంఘం ఎస్ టి విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శెట్టి నీలవేణి

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) ;రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు *సజ్జల రామకృష్ణారెడ్డి* కి కలిసి విన్నవించారు ఎంపీపీల సంఘం ఎస్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు అనంతగిరి ఎంపీపీ శ్రీమతి *శెట్టి నీలవేణి* .

ఆయన్ను ఆయన కార్యాలయంలో బుధవారం కలిసిన ఎంపీపీ ల బృందం పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణ రెడ్డి కు వివరించారు.ఎంపీపీల గౌరవ వేతనం 6000 నుంచి 15 వేల వరకు పెంచాలని ,

రవాణా చార్జీలను 8,000 నుంచి 20వేల రూపాయలకు పెంచాలని కోరారు .అదే విధంగా ఎంపీపీ లకు వ్యక్తిగత సహాయకులను ఏర్పాటు చేయాలని కోరారు. మండల పరిషత్ సాధారణ అభివృద్ధి నిధుల వినియోగంలో ఎంపీపీ లకు చెక్ పవర్ ను సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఏజెన్సీ ఆచార సంప్రదాయాల దృశ్య అధిక సంతానం అనదిగా వస్తున్న తరుణంలో మన్య ప్రాంతంలో స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే అధిక సంతానం ఉన్నవారు పోటీకి అర్హులుగా అవకాశం కల్పించాలని కోరారు.

 

అదేవిధంగా కాకినాడ జిల్లా *రౌతులపూడిలో* గిరిజన మహిళ అయినటువంటి ఎంపీపీ *రాజ్యలక్ష్మి* పై దాడికి పాల్పడిన ఘటనను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు .

దీనిపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి తమ దృష్టికి వచ్చిందని సమస్య పరిష్కరించే దిశగా చూస్తామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఎంపీపీల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకొని వెళ్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జీకే వీధి ఎంపీపీలు అనూష దేవి బోయిన కుమారి అనంతగిరి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు శెట్టి ఆనంద్, మండల నాయకులు షేక్ మదీనా,పాడి కృష్ణ మూర్తి,శ్రీను, పాల్గొన్నారు.

అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షురాలు పాడేరు శాసనసభ్యురాలు శ్రీమతి కె భాగ్యలక్మి ని, అరకులోయ శాసన సభ్యులు శ్రీ చెట్టి ఫాల్గుణ ని విజయవాడలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!