సార్ ఈ న్యూస్ ను అఖండ భూమి వెబ్ న్యూస్ లో పెట్టండి

 

గుండెపోటుతో మృతి చెందిన బీరం ఎంపీటీసీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 10 లక్షల సాయం

చెక్కును అందించిన పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్ట‌గుళ్ళి భాగ్యలక్ష్మి అల్లూరి జిల్లా పాడేరు గూడెం కొత్త వీధి (అఖండ భూమి వెబ్ న్యూస్) అల్లూరిసీతారామరాజు జిల్లా

పాడేరు నియోజకవర్గంలో గుండెపోటుతో అకాల మరణం చెందిన జి.మాడుగుల మండలం బీరం ఎంపీటీసీ కొటారి పెద్ద బాలన్న కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును పాడేరు శాసనసభ్యులు *శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి శుక్రవారం పెద్ద‌ బాలన్న *భార్య, లక్ష్మి. కుమార్తె. నమోమి. కుమారుడు రాంబాబు. పెదనాన్న కర్రన్న .కుటుంబ సభ్యులకు పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి క్యాంప్‌ కార్యాలయంలో అందజేశారు. కొటారి పెద్ద బాలన్న అకాల మరణం విషయాన్నిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి పాడేరు శాసనసభ్యులు *శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గతంలో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా ప్ర‌క‌టించిన‌ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. దానికి సంబంధించిన చెక్కును పెద్దబాలన్న‌ కుటుంబానికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యేభాగ్యలక్ష్మి మాట్లాడుతూ పెద్ద బాలన్న గారు మృతి చెందిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన మరుక్షణమే మన ఎంపీటీసీ గుండెపోటుతో మరణించడం బాధాకరమని ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని ఉద్దేశంతో వెంటనే రూ.10 లక్షలు ప్రకటించారని తెలిపారు. నాయకులు కష్టాల్లో ఉంటే భుజం త‌ట్టి వెళ్లిపోయిన సందర్భాల్లో చూశాం గాని ఈ విధంగా ఆర్థిక సాయం అందించినటువంటి రాజకీయ పార్టీలను ఇప్పటివరకు చూడలేదన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, జి.మాడుగుల సర్పంచ్ కిముడు రాంబాబు, గెమ్మెలి సర్పంచ్* సిద‌రి కొండబాబు, లువ్వాసింగి ఎంపీటీసీ గబ్బాడి సన్యాసి దొర, మండల కన్వీనర్ లంకెల కళ్యాణ్, కె.కొడపల్లి సర్పంచ్ మాతే వెంకటరమణ, భీరం మాజీ సర్పంచ్ తుర్రే కృష్ణమూర్తి , సింగర్భ సచివాలయం కన్వీనర్* వండ్లబు సూర్యప్రకాష్ నాయుడు, భీరం సచివాలయం కన్వీనర్*వంతల రమణ, సోషల్ మీడియా కన్వీనర్ సాగేని లక్ష్మీపడల్, వైసీపీ సీనియర్ గావేలి రమణబాబు, బుటరీ భగవాన్, తుర్రే రాంబాబు, నుర్మని శ్రీనివాస్ నాయుడు, కొర్ర సోంబాబు, మణుగూరు బాలన్న తదితరులు పాల్గున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!