విద్యాలయాల…? కాసుల దుకాణాలా…?
డబ్బు సంపాదనే లక్ష్యంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
ఓర్వకల్లు రూరల్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
నిబంధనలు ఉల్లంగన డిపెండింగ్ పాఠశాలల్లోనే పుస్తకాల, ఇతర సామాగ్రి విక్రయం షూ, టై, బెల్ట్, యూనిఫామ్, పుస్తకాలు మాదగ్గర కొనకపోతే మీకు సీట్లు ఇవ్వం-అంటూ బెదిరింపులకు దిగుతున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తు నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలి ఈరోజు ఓర్వకల్లు మండలం కేంద్రంలో ఉన్నటువంటి బాలభారతి స్కూల్ దగ్గర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అధిక ఫీజులు విషయం లో బాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి రమేష్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర నాథ్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్, లు మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాఠశాలలో ఆవరణంలోనే దుకాణాలు పెట్టి స్కూల్ టై, బెల్ట్, షూ, యూనిఫార్మ్,పుస్తకాలను అమ్ముతున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా కేవలం కొన్ని పాఠశాలల యాజమాన్యాలు డబ్బు సంపాదన ధ్యేయంగా పాఠశాలలను నిర్వహిస్తున్నారని అటువంటి పాఠశాల పైన ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇస్టారాజ్యంగా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు అని విద్యాశాఖ అధికారులను విద్యార్థి. యువజన సంఘం నేతలు ప్రశ్నించారు. అంతేకాకుండా మరికొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తూ, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు కరపత్రాలు ముద్రించి అక్రమంగా అడ్మిషన్ చేసుకొని విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్న కూడా ఆ రేకుల షెడ్డులలో పాఠశాల నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు కూడా ఈరోజు బుక్స్ ఫీజుల పేరుతో, వివిధ రకాల ఫీజుల పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున విద్యాశాఖ అధికారులు స్పందించి విచ్చలవిడిగా ఫీజులు దోపిడీలకు పాల్పడుతూ, దుకాణాలు పెట్టి పాఠశాలలో అన్ని వస్తువులు అమ్ముతూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు మండల విద్యాశాఖ అధికారి సునందని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో డీఈవో కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ యు జిల్లా అధ్యక్షుడు శరత్, బాలక్రీష్ణ, నాయక్, అస్లాం బాషా, అనిల్ లు పాల్గొన్నారు.



