ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలి. .. … ఎస్ఎఫ్ఐ
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ
డోన్ పట్టణం జూన్ 23 అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలని. నిరసన తెలియజేయడం జరిగింది. *సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తెలుగు విజయ్ కుమార్,డోన్ మండల సహాయ కార్యదర్శి బి. సునీల్ కుమార్ మాట్లాడుతూ*
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించలేమంటూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలు కొనుక్కోవాలంటూ ఇంటర్ విద్యాశాఖ ఆదేశించడాని ఖండిస్తున్నాం. గత మూడు సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం లేదు. పాఠ్య పుస్తకాలు అందించకపోతే ఇంటర్ విద్యార్థులు ఏ రకంగా చదువుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మా ప్రభుత్వం విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నామంటూ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించకపోగా విద్యార్థులు ఫీజులు ద్వారా కట్టిన ఇంటర్ విద్యామండలి నిధులు మొత్తం నాడు-నేడు పథకానికి దారి మళ్లించడాని సిగ్గుచేటుగా భావిస్తున్నాము. వెంటనే ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యచరణతో ఆందోళనలకు పూనుకుంటామని తెలియజేశారు.*
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తాజ్ ,చిన్న, మహేంద్ర, లతా, మాధురి, పుష్ప, జ్యోతి మరియు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు..



