అంగన్వాడీ లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని అంగన్వాడీ లుధర్నా
రంగంపేట. ఆకాండ భూమి వెబ్ న్యూస్ :
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లోని అంగన్వాడీ వర్కర్స్ హెల్పేర్స్ కి వేతనాలు కాకినాడ జిల్లా నుండి వేస్తున్నారు. వేతనాలు ప్రతినెలా సక్రమంగా రాక అనేక ఇబ్బందులు కి గురి అవుతున్న అంగన్వాడీ లకు నెలల తరబడి పెండింగ్ ఉంటూ జీతాలు పడక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .అమలాపురం,గన్నవరం,రాజోలు,రాయవరం ,రంగంపేట,జగ్గంపేట,పెద్దాపురం సామర్లకోట అర్బున్ ,కపీలేశ్వరపురం,కాకినాడ, తదితర ప్రాజెక్ట్ ల నుండి జీతాలు పడని వారు వచ్చి ఆందోళన చేశారు. అలాగే రిటైర్మెంట్ అవ్వి ఒక హెల్పేర్ 3సంవత్సరాలు ఐనది రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం ఎదురు చూసి చూసి చనిపోయినది. కాకినాడ ప్రాజెక్ట్ లో. ఈమె కాకుండా గత 2 సంవత్సరం ములుగా రిటైర్మెంట్ అయ్యి ఎమౌంట్ పడని వారు ఉన్నారు వారికి వేయాలని ,హెల్పేర్స్ ప్రమోషన్ లో రాజకీయ జోక్యం ఆపి ప్రమోషన్ లు ఇవ్వాలని. తదితర డిమాండ్స్ పై ధర్నా నిర్వహించి రెప్రెసెంటిషన్ సుపెరినెంట్ ప్రభ కి లక్ష్మీ సీడీపీఓ కి ఇవ్వడమైనది…పి.డి లీవ్ లో ఉన్నారు. .. ఈ ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి కాకినాడ ప్రాజెక్ట్ కార్యదర్శి ఎం.జ్యోతి. కోనసీమ జిల్లా రాయవరం ప్రాజెక్ట్ కార్యదర్శి డి.ఆదిలక్ష్మి. రాజోలు కార్యదర్శి కె.సుజాత. అంగన్వాడీ లు. ఉన్నారు…..
ఈ .చంద్రావతి అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి



