అభివృద్ది, సంక్షేమ ప్రదాత మన ముఖ్యమంత్రి
– కాపవరంలో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మేల్య్ సూర్యనారయణరెడ్డి
బిక్కవోలు. అఖండ భూమి వెబ్ న్యూస్ :
తూర్పుగోదావరిజీల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో శుక్రవారం స్దానిక ఎమ్మేల్య్ సత్తి సూర్యనారయణరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
సచివాలయ అధికారులు,వాలంటీర్లుతో కలిసి గ్రామంలోని ప్రజలు వద్దకు వేళ్ళి వైసిపి ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అయిన తరువాత పొందిన లబ్దిని ప్రజలుకు వివరించారు.
అలానే ప్రజలు వద్ద నుంచి సమస్యలును తెలుసుకుని వాటిని అధికారులు సమక్షంలో పరిష్కారించే దిశగా సూచనలు చేసారు.ప్రజలు వద్ద నుంచి వైసిపి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రోడ్లు,డ్రైనేజీలు బాగుపడ్డాయిని అందరికి అర్హతని బట్టి సంక్షేమ పథకాలు అందుతున్నాయని,పెన్షన్లు,ప్రభుత్వం ఇచ్చే సర్టిపికెట్స్ అన్ని ఆఫీసులు చూట్టూ తిరగకుండానే వాలంటీర్లు తేచ్చి అందజేస్తున్నారుని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఎమ్మేల్య్ సూర్యనారయణరెడ్డి ఆనందం వ్యక్తం చేసారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం,అభివృద్ది ప్రదాత అని వాటిని తుచ తప్పకుండా పాటీస్తూ,గ్రామ సచివాలయలు,వాలంటీర్లు వ్యవస్ద ద్వారా ప్రజలుకు అన్ని సేవలును అందజేయడంలో మా ప్రభుత్వం విజయం సాధించిందని దానికి ఉదహరణ ప్రజలు నుంచి వస్తున్న స్పందనే అని అన్నారు.ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం ఎలాంటి బేధాలు లేకుండా అందరికి అందించిన ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమే అని తెలియజేసారు.
ఈకార్యక్రమంలో వైసిపి ప్రచార నాయకులు రొంగల అప్పాజీ,గ్రామ సర్పంచ్ వెంకటరమణ,వార్డు మెంబర్స్,సచివాలయ అధికారులు,వాలంటీర్లు,సోషల్ మీడియా ప్రతినిధి వెంకన్నబాబు(దొరబాబు) తదితరులు పాల్గొన్నారు.



