నవోదయలో కోటనందూరు విక్టరీ స్టడీ సర్కిల్ లో ప్రభంజనం…….
విక్టరీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చిన్ని.
కోటనందూరు( అఖండ భూమి). స్థానిక మండలంలో కోటనందూరు విక్టరీ స్టడీ సర్కిల్ లో 2023 సంవత్సరంలో ఆరుగురు విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ పి చిన్ని శుక్రవారం తెలిపారు. ఎం అనుప్రియ, ఐ భువనేస్, ఎం అభిషేక్, డి అమృత, ఎం హర్ష, ఎన్ య శ్విన్ ముక్కింద్ లు నవోదయ ఎంట్రన్స్ విజయం సాధించారు. కోటనందూరు శ్రీ సాయి విద్యానికేతన్-2( ఎం అనుప్రియ,, ఐ భువనేష్),, బొద్దవరం ప్రణతి స్కూల్-1( ఎం అభిషేక్),, గ్రేసియస్ గన్నవరం ( డి అమృత),, అల్లిపూడి ప్రభుత్వ స్కూల్-1( ఎన్. య శ్విన్ ముక్కింద్), దుర్గాడ ప్రభుత్వ స్కూల్-1( ఎం. హర్ష) లు విక్టరీ స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకుని విజయం సాధించారు. నవోదయలో సాధించిన విద్యార్థిని, విద్యార్థులను ఆ సంస్థ డైరెక్టర్ చిన్ని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి విద్యార్థిని విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, , గ్రామ పెద్దలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మండల నాయకులు వీరిని( విద్యార్థిని విద్యార్థులను) అభినందించారు.



