మృతురాలు కుటుంబాన్ని ఆదుకోవాలి.
అల్లూరి జిల్లా: అనంతగిరి (అఖండ భూమి) జూన్ 23:అనంతగిరి మండలంలోని ఎగువ శోభ పంచాయితీలో సచివాలయం మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కోర్ర జయ భర్త ప్రధాని సురేష్ భార్య గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అయితే రెండు సంవత్సరాలు గడుస్తున్న రెండు నెలలు జీతాలు చెల్లించకపోవడం గమనర్హం. ఆ విషయమై బాధిత కుటుంబానికి జీతాలు చెల్లించి ఆదుకోవాలని స్థానిక మండల ఎంపీడీవో ఏవివి కుమార్ కి అనంతగిరి మండల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పి రామకృష్ణ , మృతురాలి భర్త సురేష్ వినతి పత్రం సమర్పించారు. సంబంధిత అధికారులకు అనేకమార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదన్నారు. స్థానిక ఎంపీడీవో సానుకూలంగా స్పందిస్తూ వీలైతే అర్హత కలిగిన వారికి వారి స్థానంలో కారుణ్య నియామకంలో భాగంగా ఉపాధి కల్పించి వారి కుటుంబమునకు ఆదుకుంటామని తెలియజేశారు. అధికారులు నిర్లక్ష్యం చేపడితే న్యాయం జరిగే వరకూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జాయింట్ యాక్షన్ కమిటీ భరోసా ఇవ్వడం జరిగింది.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



