జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.  డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు.

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.

డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు.

ఆలమూరు (అఖండ భూమి):గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,పిఠాపురం నియోజవర్గ పరిశీలకులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు అన్నారు.శుక్రవారం మండల కేంద్రమైన ఆలమూరు రైతు భరోసా కేంద్రం నందు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,వైసిపి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రావాడ సత్తిబాబు ఆధ్వర్యంలో కన్వీనర్లు,గృహసారథులు,వాలంటీర్లకు జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వైసీపీ మండల కన్వీనర్,చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్,వైసీపీ సీనియర్ నాయకులు నామాల శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తుందని,అధికార బృందాలతో ఇంటింటికి వెళ్లినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయని వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించాలన్నారు.అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం వల్ల రాబోయే కాలంలో కన్వీనర్లు,గృహసారథులు,వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.ఈ కార్యక్రమంలో చల్లా నానాజీ,చల్లా భూషణం,లంకె వెంకటరెడ్డి,ఎలుబంటి బూరయ్య,డిపి రావు,కోనసీమ శివ,కోలా నాని,షరీఫ్,గంధం చంద్రం,ఎరుకొండ గణేష్,కన్వీనర్లు,గృహసారథులు,వాలంటీర్లు,వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!