నిరుపేద కుటుంబానికి గుడ్ సీడ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం.
ఉప్పలగుప్తం (అఖండ భూమి)
ఇటీవల కురిసిన గాలి వర్షానికి పూరిల్లు కుప్పకూలి ప్రాణాలతో బయటపడిన నిరుపేద కుటుంబా నికి శుక్రవారం అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి సీనియర్ నాయకుడు,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు స్థానిక సర్పంచ్ జొన్నాడ శ్రీదుర్గ చేతుల మీదుగా బియ్యం,కూరగాయలు, నిత్యా వసర సరుకులను అందజేశారు గొల్లవిల్లి పంచాయితీ వాడపర్రు అశోక్ నగర్ కు చెందిన దేవరపల్లి వెంకటేశ్వరరావు పూరిల్లు కూలి పోవడంతో ఆ కుటుంబం నిరాశ్రులయ్యారు. సాయం అందించిన రమణారావుకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.ఉప సర్పంచ్ మారిశెట్టి దుర్గారావు, పంచాయతీ వార్డు సభ్యుడు పరమట సత్యనారా యణ సచివాలయ కన్వీనర్ లు బడుగు అబ్బులు,చప్పిడి వెంకటేశ్వరరావు, వైసిపి నాయకులుజొన్నాడ చిన్ని,చప్పిడి దుర్గారావు, దేవరపల్లి వెంకటేశ్వరరావు,గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు పరమట రాజేష్,కుంచే అర్జున్,దోనిపాటి రాంబాబు, పరమట జాన్, పోలినాటి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



