పురిటినొప్పులతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
జూన్ 25 అల్లూరు జిల్లా
మన్య ప్రాంతంలో రహదారి సౌకర్యాలు లేకపోవడంతో గిరిజన బిడ్డలు పురిటింపులతో బాధపడుతూ మృత్యువాత పడుతున్నారని పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు మండలంలో మూలపేట పంచాయతీకి కుమ్మర్ల గ్రామానికి చెందిన పాంగి రోజా పురిటి నొప్పులతో బాధపడుతూ రహదారి సౌకర్యం లేక మార్గమధ్యంలోనే మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను శనివారం రాత్రి కాలినడకన ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లి గిడ్డి ఈశ్వరి పరామర్శించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చులకన భావన అని ఆమె విమర్శించారు మన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీకి చెందిన నాయకులు రోడ్లు లేని కారణంగా గిరి మహిళలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మృత్యువాత పడుతూనే ఉన్నారని దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆమె అన్నారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే కుమ్మర్ల గ్రామానికి రహదారి సమస్యతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా గ్రామస్తులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు


