యువతను సరైన మార్గంలో పెంచాలి.
 
పార్వతీపురం, జూన్ 24 అఖండ భూమి వెబ్ న్యూస్ : యువతను మారకద్రవ్యాల బారిన పడకుండా సరైన మార్గంలో జీవించేలా పెంచాలని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు తెలిపారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం రెండవ అదనపు జిల్లా కోర్టు సమావేశ మందిరంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యుక్త వయసు పిల్లలను సరైన మార్గంలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. యువత మారకద్రవ్యాలు సేవించినా, కలిగిఉన్న, రవాణా చేసిన చట్టప్రకారం నేరస్తులవుతారన్నారు. ప్రతీ ఏడాది నాలుగు లక్షల మంది యువతులు అదృశ్యం అవుతున్నారని దానికి కారణం యువత సరైన పద్దతిలో పెరగక పోవడం, మానవ అక్రమరవాణా, మారకద్రవ్యాల వినియోగమని తెలిపారు. పిల్లలకు చిన్న తనం నుండే వారు స్వతంత్ర్యంగా జీవించేలా అన్ని పనుల్లో శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులు పై ఉందని అన్నారు. పిల్లలను నిజ జీవితంలో పెంచాలని చిన్న తనం నుండే కష్టపడి పనిచేయడం నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులు పై వుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువ గారాబంగా పెంచడం వలనే చెడు వ్యసనాలకు గురి అయి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దానిని రూపు మార్చవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఉమ్మడి కుటుంబం ద్వారానే మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు వస్తాయని, ఈ ఆధునిక ప్రపంచంలో జీవన విధానంలో చాలా మార్పులు రావడంతో జల్సాలు పేరిట యువత చెడు వ్యసనాలకు గురి అవుతున్నారన్నారు. యువత ముఖ్యంగా ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులను మించిన ప్రేమ ఈలోకం లేదని, యుక్తవయస్సలో గల పిల్లలతో తల్లిదండ�


