సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం పర్యవేక్షణలో కురుపాంలో సీఎం వైయస్ జగన్ సమావేశం ఏర్పాట్లు.
 
 
తలశిల రఘురాం తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు.
పార్వతీపురం, జూన్ 24 (అఖండ భూమి ) :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోయే అమ్మఒడి కార్యక్రమం సమావేశానికి అవసరం అయిన ప్రధాన సభా వేదిక హేలీ ప్యాడ్ నిర్మాణం, వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లు గత రెండు రోజులుగా జరుగుతుండగా నేడు శెనివారం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఎమ్మెల్సి సభ్యులు రఘురాం తో పాటు కలిసి పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆయా పనులను పర్యవేక్షించడం జరిగినది. సీఎం సమావేశము తేదీ దగ్గర పడటంతో పాటు మరో వైపు వాతావరణం అననుకూలంగా మారడంతో సీఎం సమావేశానికి భద్రతా విసయాలతో పాటు పబ్లిక్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా, సమావేశానికి విచ్చేసే విద్యార్థులకు, వైకాపా శ్రేణులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో నిమజ్ఞమై రాత్రింబవల్లు పని చేయడం జరుగుతుంది. ఈ పర్యటనలో పార్వతీపురం పట్టణం పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


