
జగనన్న సురక్ష” కార్యక్రమములో అడ్డాపుశీల గృహ సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న టిడ్కో ఛైర్మన్.
పార్వతీపురం, జూన్ 24 (అఖండ భూమి వెబ్ న్యూస్ : ఏ.పి.టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ పర్యటనలో భాగముగా అడ్డాపుశీల గ్రామ పార్టీ ముఖ్య నాయకుల ఆహ్వానం మేరకు ప్రజల సమస్యలపై “జగనన్న సురక్ష” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన అందరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అయ్యే విధముగా ప్రత్యేక వార్డ్ వాలంటీర్ గ్రామ వార్డ్ సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగింది అని దేశము మొత్తము మీద ఏ రాష్ట్రములో లేని విధముగా ప్రజల వద్దకు పాలన చేరువయ్యే దిశగా ప్రజా పరిపాలనలో వినూత్న మార్పులు చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుంది అని ప్రజలకు తెలియజేయడం జరిగింది, అంతేకాకుండా అర్హులై ఉండి ఎవరైనా సంక్షేమ పధకాలు అందనటువంటి ప్రజలకు సమస్యల పరిష్కారం కొరకు అధికారులకు తెలియజేసే విధానము పై అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం పలు సంక్షేమ పథకాలు అమలు మరియు ప్రస్తుతం ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూసే చాలా మంది ప్రజలకు నేరుగా ముఖ్యమంత్రి తో మాట్లాడేందుకు 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చెయ్యడం జరిగింది అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ హౌసింగ్, పెన్షన్స్,సున్నావడ్డీ, జగనన్న అమ్మ ఒడి,జగనన్న చేయూత మరియు పలు సర్టిఫికెట్ ల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులు తో మాట్లాడుతూ పరిష్కారము కోసం వెనువెంటనే సంభందిత సచివాలయ అధికారులు తో పత్రాలను తీసుకోవడం జరిగింది.ప్రతిపక్షాలు సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్ సీపీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే జగనన్న కి చెప్పుదాం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సర్పంచ్ లు ఎం పి టి సి లు పెద్ద ఎ



