
డాక్టర్లకు విధులపై శిక్షణ.
పార్వతీపురం, జూన్ 24 అఖండ భూమి వెబ్ న్యూస్ :
వైద్యులు అంకితభావంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథం తెలిపారు. శనివారం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో కొత్తగా నియమితులైన వైద్యులకు వారి విధులపై అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథరావు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ మంది గిరిజనులు, పేదవారని రాజు ప్రభుత్వ వైద్య సేవలు మీదే ఆధారపడతారని కావున వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాలన్నారు.అత్యవసర విధులు, క్షేత్ర పర్యటనలు , ఆశా, ఎ.ఎన్.ఎమ్. లతో కలిసి యాప్స్ పర్యవేక్షణ, మాతా శిశు సంరక్షణ, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మొదలగు వాటిపై పూర్తి అవగహన కల్పించారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్స్ సమన్వయంతో కలిసి పని చేయాలని అయన అన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రాం అధికారి డా. డి. భాస్కరరావు, డా.ఎం. నవీన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


