10 కోట్లతో ఉడాయించిన చీటి వ్యాపారి…

 

10 కోట్లతో ఉడాయించిన చీటి వ్యాపారి

గంగవరం జూన్ 24 ఆఖండ భూమి వెబ్ న్యూస్ :

అమాయకులకు కుచ్చుటోపి పెట్టి కోట్లు కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు రాత్రికి రాత్రే ఊరు నుండి ఉడాయించిన సంఘటన గంగవరం మండలంలో చోటు చేసుకుంది. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాలు మేరకు కీలపట్ల పంచాయతీ నలసానిపల్లె గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు శంకరయ్య గత కొంత కాలంగా తమ గ్రామంలో పలమనేరు పట్టణం బజారు వీధిలో అద్దెకు ఉంటూ చీటీలను నిర్వహించేవాడు. శంకరయ్య ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రతి నెల 5 లక్షలు,10 లక్షలు,15 లక్షలు,20 లక్షలు చీటీలను నిర్వహించేవాడు. అతనికి గ్రామంలో పలమనేరు పట్టణంలోను సొంత భవనాలు ఉండటంతో చాలా మంది అమాయకులు, నమ్మకంతో అతని వద్ద చిట్టీలు వేశారు. నలసానిపల్లె, పలమనేరు, తమ్మిరెడ్డిపల్లె, గ్రామాల వారే కాక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొందరు చీటీలు వేశారు. చిట్టీల గడువు పూర్తి అయినా కూడా డబ్బులు ఇవ్వకుండా నెలలు తరబడి తిప్పుకుంటూ, కాలయాపన చేశానని, చిట్టీల నిర్వాహకుడు రాత్రికి రాత్రే వారు పిల్లలతో సహా గ్రామం నుండి ఉడాయించాడని బాధితులు లబోదిబోమని పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకొని చీటీలు కట్టామని కన్నీళ్ల పర్యాంతమవుతున్నారు. అయితే నిర్వాహకుడు శంకరయ్య రెండు నెలల క్రితమే తన ఆస్తులను బందువుల పేరుపై రాయించినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుల నుండి ఫిర్యాదులు అందుకున్న ఎస్సై ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా శంకరయ్య కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!