16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు ₹2102 కోట్లు..
దిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది..
ఈ ఏడాది బడ్జెట్‌లో (Union Budget) ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు..
ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు..
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



