పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం.
అంగన్వాడీ జీపు జాతను ప్రారంభించిన సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు.
రాజవొమ్మంగి అఖండ భూమి జూన్ 25
,రాజవొమ్మంగి,, పోరాటాల ద్వారానే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్ల సమస్యలు పరిష్కారం అవుతాయని అంగన్వాడీ వర్కర్ల అండ్ హెల్పర్ల యూనియన్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి నిర్మల, సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు అన్నారు,అంగన్వాడి వర్కర్ల,హెల్పర్లు,మినీ వర్కర్ల సమస్యలు పరిష్కారానికై,ఐసిడిఎస్ పరిరక్షణ కొరకు ఈనెల 25,26,27 తేదీలలో రంపచోడవరం డివిజన్లో జరిగే జీపుజాతను ఆదివారం మండలంలోని లాగరాయి గ్రామంలో సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు జండా ఊపి ప్రారంభించారు,ఆదివారం ఈజీపు జాత లాగరాయి, రాజవొమ్మంగి, దూసరపాము,జడ్డంగి, చెరుకుంపాలెం మీదుగా అడ్డతీగల చేరుకొంది ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి నిర్మల, యూనియన్ జిల్లా నాయకురాలు కె వెంకటలక్ష్మి,రాణి,సీఐటీయూ జిల్లా నాయకులు పి రామరాజు తదితరులు మాట్లాడుతూ,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత,పనికి తగిన వేతనం,పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, ఐసిడిఎస్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, వైయస్సార్ సంపూర్ణ

పోషణ మెనూ చార్జీలు పెంచాలని,గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఏర్పాటు చేసి మినీ వర్కర్లకు అంగన్వాడి మెయిన్ వర్కర్ జీతాలుగా ఇవ్వాలని,హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలని, అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని,బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు చిన్ని కుమారి, సంతోషి, మంగ,సత్యవేణి, సత్యవతి,వరలక్మి,మేరి,రత్నకుమారి,లక్మి,సునీత తదితరులు పాల్గొన్నారు.


