చలువ పందిరి వాహనాలక… ? ప్రయాణికులకా…?

 

వెల్దుర్తి ఏప్రిల్ 29 ( అఖండ భూమి ) : స్థానిక పాత బస్టాండ్ నందు ఎండలు అధికంగా ఉన్నందువలన ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మేజర్ గ్రామపంచాయతీ చలువ పందిరిని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడి దుకాణదారులు, వాహనదారులు చలువ పందిరి కింద ద్విచక్ర వాహనాలు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత మేజర్ గ్రామపంచాయతీ అధికారులు, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకొని వాహనదారుల ద్విచక్ర వాహనాలను తొలగించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలవబందిరి ప్రయాణికులకే ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!