యానంలో మైనర్ బాలుర్లకు గంజాయి విక్రయిస్తున్న వారిని ఆ రెస్టు చేసిన పోలీసు శాఖ.
యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ :
పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు. సిఐ షణ్ముగం, ఎస్.ఐ శేరు నూకరాజు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక హైస్కూల్ రోడ్డులో గ్రంథాలయం వెనుక ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే
సమాచారం మేరకు దాడిచేసి యానాం జి.ఎం.సి బాలయోగి నగర్ కు చెందిన పెమ్మాడి శ్యామల్ కుమార్, నాతి రాజేష్ లను అరెస్ట్ చేశామన్నారు, వారి నుంచి 6 ప్యాకెట్ లలోని 150 గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నామని విలేకరుల సమావేశంలో చెప్పారు. గంజాయిని మైనర్ బాలుర్లకు సైతం అమ్ముతున్నట్లు తమ విచారణలో తెలిసిం దన్నారు నిందితులు ఇద్దరు డ్రగ్స్ కు సైతం అలవాటు పడ్డారని, గంజాయిని కాకినాడ- తుని ప్రాంతాలలో కొనుగోలు చేసి యానాం రీజియన్ లలో అమ్ముతున్నారన్నారు. వీరిద్దరిని సబ్-కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారన్నారు.ఈ గంజాయి దాడులలో ఎస్సై శేరు.నూకరాజుక్రైమ్-టీం పెద్దిరెడ్డి సతీష్, కాచర్ల వెంకటరమణ (జాన్టి),మల్లాడి గణేష్ పాల్గొన్నారు.



