వినియోగదారునికి షాక్ కొడుతున్న కూరగాయల ధరలు
రాజవొమ్మంగి, అఖండ భూమి,జూలై 3 : ఏజెన్సీలోని వారపు సంతలలో కూరగాయల ధరలు వార వారానికి పెరుగుతూ వినియోగదారులకు షాక్ కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజవొమ్మంగి,మండల చెడ్డంగి గ్రామంలో ఆదివారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు. ఒక్క ఉల్లిపాయ కేజీ 40 రూపాయలు తప్ప, పచ్చిమిర్చి 200 రూపాయలు, టమోటా కేజీ 160 రూపాయలు, కేజీ బరువున్న ఆనపకాయ 50 రూపాయలు, బంగాళదుంప,బీట్రూట్,క్యారెట్, చామదుంపలు కేజీ 80 రూపాయలు, కొత్తిమీర చిన్న సైజు కట్ట 50 రూపాయలు, అదే విధంగా మిగతావి కూడా సామాన్యుడికి అందలేనంత ఖరీదులో ఉన్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరే తినట్టు వ్యవహరిస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కూరగాయ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వీరు కోరుచున్నారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



