ఘనంగా గురుపౌర్ణమి పూజలు వేడుకలు

ఉదయం నుంచి రాత్రి వరకు భజనలు, ప్రత్యేక పూజలు
సాయి నామస్మరణతో మార్మోగిన శిరిడి సాయి ఆలయం
రాజవొమ్మంగి,అఖండ భూమి జూలై 3 :
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండల లో ఆషాఢ శుద్ధ పౌర్ణమి తిధి సందర్భంగా సోమవారం గురుపౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాలను పచ్చటి తోరణాలు, పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేకువజాము నుంచి బాబావారికి మేలుకొలుపు, కాగడ హారతి, పలు రకాల అభిషేకాలు, ప్రత్యేక పూజలు, నూతన వస్త్రాలంకరణలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. షిరిడీ సాయినాథుడి ఆలయం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి అంటూ సాయి నామస్మరణలో బాబా మందిరం ఉదయం నుంచి మారు మోగింది . భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …


