అనుమతి లేని విత్తనాలను విక్రయిస్తే చర్యలు తప్పవు.. వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా,
వెల్దుర్తి జులై 03 అఖండ భూమి వెబ్ న్యూస్ :
పట్టణంలోని ఫర్టిలైజర్ పెస్టిసైడ్ దుకాణదారులు అధిక రేట్లు తో విక్రయించకూడదని మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ, పెస్టిసైడ్స్, విత్తన దుకాణమును అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విత్తన దుకాణములోని రిజిస్టర్లను, స్టాకు బోర్డులను, లైసెన్స్ లను, అనుమతి పత్రాలను, బిల్లులను గోడౌన్ లలో ఉన్న విత్తనముల నిల్వలను తనిఖీ చేయడం జరిగింది
శ్రీ బాలాజీ సీడ్స్ , పెస్టిసైడ్స్ దుకాణములోని 1328 ప్యాకెట్ల మొక్కజొన్న విత్తనాలకు సంభందించి సరైన పత్రాలు చూపించని సుమారు రూ,, 21 లక్షల 24 వేల రూపాయల విలువ గల విత్తన నిల్వలను తాత్కాలికంగా అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది
విత్తన డీలర్లు స్థాకు రిజిస్టర్లు, బిల్ బుక్స్, స్థాకు బోర్డ్స్ ను రోజు వారీగా తప్పనిసరిగా నమోదు చేస్తూ అనుమతి ఉన్న విత్తనములను మాత్రమే అమ్మాలని ఆదేశించడం జరిగింది .



