బోగోలు చెరువు చేపల వేలం పాట ఉగాది రాజు కైవసం…

 

బోగోలు చెరువు చేపల వేలం పాట ఉగాది రాజు కైవసం…

వెల్దుర్తి జులై 03 (అఖండ భూమి) : మండల పరిధిలోని బోగోలు గ్రామానికి చెందిన చెరువు చేపల వేలంపాట సోమవారం ముగిసింది. ఈ వేలం పాటలో 9 మంది ఒక్కొక్కరు 20 వేల రూపాయలు డిపాజిట్ చేసి వేలంపాటను కొనసాగించారు. ఈ వేలం పాట దేవుని పాటగా మొదలుపెట్టి దాదాపు గ్రామంలో దస్తగిరి కట్ట దగ్గర వేలంపాట గ్రామ సేవకుడు పాటను కొనసాగించాడు. దాదాపు రెండు గంటల పాటు వేలం పాటను కొనసాగించారు. డిపాజిట్ చేసిన వారు మాత్రమే కొనసాగించడంతో ఎటువంటి గొడవలు లేకుండా కొనసాగించిన కొనసాగింది. దీనికి గ్రామ పెద్ద మనుషులు కంగాటి వెంకటరమణారెడ్డి, అమర్నాథ్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, కమలాకర్ లు పాల్గొని వేలం పాటను సజావుగా కొనసాగించేందుకు వారి సహకారం అందించారు. ఈ వేలం పాటలలో 9 మంది పోటీలో పాల్గొనగా అందులో ఉగాది రాజు, 5 లక్షల అరవై వేలకు బోగోలు చెరువు చేపల వేలంపాటను దక్కించుకున్నారు. గత రెండు సంవత్సరాల నుండి వేలంపాటలో వచ్చినటువంటి రుసుము వీరభద్ర స్వామి తేరుకు ఉపయోగించ నున్నట్లు తెలిపారు. ఈ తేరు ను సమకూర్చేందుకు గ్రామంలో నేటికీ ఇద్దరు చొప్పున వెళ్లాలని సూచించారు. ఇందులో స్వార్థం ఉపయోగించకుండా దేవుని కార్యక్రమం సజావుగా జరిగే విధంగా చూడాలని గ్రామ పెద్దమనుషులు తెలిపారు. ఈ వేలం పాటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రసాద్, రామకృష్ణ, అమీర్, వీరాంజి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!