హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

 

Draupadi murmu: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు..

సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

ద్రౌపదీ ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి ద్రౌపదీముర్ము చేరుకుని అల్లూరి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు..

Akhand Bhoomi News

error: Content is protected !!