మన్యం ప్రజల చైతన్యస్ఫూర్తి అల్లూ
మన్యంప్రజల శ్రమదోపిడి వంటి తెల్లదొరల దురాగతాలను ఎదురొడ్డి, ఏజెన్సీ ప్రాంత గిరిజనులందు చైతన్యం నింపిన దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు అని కడుము ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
అల్లూరి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గొర్లె తిరుమలరావు మాట్లాడుతూ కేవలం 27సంవత్సరాల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడు, బ్రిటిష్ పాలకులను ఎదిరించి సాయుధపోరాటం చేసిన మన్నెం పులి అల్లూరి అని అన్నారు.
ఉపాధ్యాయులు టి.సురేష్ మాట్లాడుతూ గిరిజనుల జీవనాధారం కోసం పోడు చెట్లను కొట్టే అవకాశం లేకుండా, బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎదుర్కొని నిలబడే అగ్గి పిడుగు అల్లూరి అని అన్నారు.
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు అల్లూరి సీతారామరాజు గూర్చి గీతాన్ని ఆలపించారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. తొలుత ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి.సురేష్, డి.జ్యోతి, పి.రాజశేఖరం, బి.గాయత్రి, వి.లక్ష్మునాయుడు, కె.నిర్మలాదేవి, జె.చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, జి.వి.భాస్కరరావు, పడాల సునీల్, బి.కిరణ్ కుమార్, ఎస్.శ్రీవాణి, బత్తుల వినీల, గుంటు చంద్రం, రవికుమార్ మహాపాత్రో, సస్మిత పాఢి, ఎస్ మురళీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.



