మహావిష్ణు స్వరూపమే శ్రీరాముడు…

 

 

అఖండ భూమి వెబ్ న్యూస్ :

మహావిష్ణు స్వరూపమే శ్రీరాముడు…

సర్వ గుణగణములూ పొందిన మహా విష్ణువు స్వరూపమే శ్రీరామచంద్రమూర్తి అని కుదమ గ్రామ పురోహితులు, ఆలయ అర్చకులు, వేదమూర్తులు, బ్రహ్మశ్రీ మావుడూరు బాలభాస్కరశర్మ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామాన శ్రీరామమందిరం ప్రతిష్ట అనంతర పూజా కార్యక్రమాలకు నేతృత్వం వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరాముడు ధర్మపరిపాలక రక్షకుడు, ఏకపత్నీవ్రతుడు, సత్యశీలవంతుడు, వేదపారాయణుడు కావడంవలనే మన భరతఖండాన ప్రతీ గ్రామాన, ప్రతీ పట్టణాన వీధివీధికీ, ప్రతీ నగరాన వాడవాడలా శ్రీరామమందిరాలు ప్రతిష్ఠించబడ్డాయని బాలభాస్కరశర్మ అన్నారు.

వేదపండితులు జ్యోస్యుల రఘునాథశర్మ మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు నడయాడిన మన భరతావని గడ్డ ఎంతో ధన్యతనొందిందనీ, అందుకే శ్రీరామ నామ జపంతో ప్రజలంతా పునీతులవ్వాలని అన్నారు.

వీరిరువురితో పాటు వేదపండితులు వేమకోటి అమరనాథ్ శర్మ, అంపోలు నరేష్ శర్మ, బంకుపల్లి గంగాధర శాస్త్రి, నేమాని మనోజ్ శర్మ తదితరులు నేటి పూజా కార్యక్రమాల్లో వేదమంత్రాలను పఠించి, కుదమ గ్రామానికి ఆదిత్మిక శోభను రంగరింపజేసారు.

ఈ పూజావ్రత సన్నిధిలో కుదమ గ్రామానికి చెందిన జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును, రాష్ట్ర స్థాయి ఉత్తమ సైన్స్ టీచర్ పురస్కార ముఖ్యమంత్రి పురస్కార గ్రహీత, విశ్రాంత మండల విద్యా శాఖాధికారి కుదమ పరమేశ్వరరావు తదితర భక్తులను అర్చక పురోహితుల చేతులమీదుగా శ్రీరామమందిర జ్ఞాపికలతో సత్కరించారు.

సత్కారాన్ని పొందిన అనంతరం కుదమ పరమేశ్వరరావు మాట్లాడుతూ తమ ఇంటి ముంగిట ఉన్న వందేళ్ళనాటి శ్రీరామమందిరం స్థానంలోనే, నేడు వెలసిన నూతన శ్రీరామమందిరం ప్రతిష్ట కార్యక్రమాలను చూసి తరించిన, తనతో పాటు భక్తజనులందరి జన్మ ధన్యమైందని అన్నారు.

కుదమ తిరుమలరావు మాట్లాడుతూ

రామనామ తారక మంత్రం పఠించుటవలన శరీరం ఉత్తేజవంతమగుననీ, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కూడిన చైతన్యవంతమైన జీవితాన్ని పొందగలరనీ, పదిమందికీ శ్రీరామనామ జపాన్ని పంచిపెట్టాలని అన్నారు.

కుదమ తిరుమలరావు ఆలపించిన భక్తిగీతాలు, ప్రత్యేక గీతాలు సభికులందరినీ అలరించాయి.

వీరితోపాటు కుదమ శ్రీరామమందిరం నిర్మాణ శిల్పి తానల పకీరు నాయుడు చినబాబు, కుదమ గ్రామ పెద్దలు రామాలయకమిటీ సభ్యులు గుంట్రెడ్డి కృష్ణమూర్తి, ఏగిరెడ్డి అప్పలనాయుడు, ఏగిరెడ్డి మోహనరావు, గుంట్రెడ్డి శ్రీను, గుంట్రెడ్డి వెంకటినాయుడు, బొంతు ప్రసాదరావు నాయుడు, బొంతు తిరుపతిరావు, యాండ్రాపు సూర్యనారాయణ, బోను సూర్యనారాయణ, అల్లు సింహాచలం, అల్లు చంద్రమౌళి, పోల పారినాయుడు, బలగ శివరామినాయుడు, ఏగిరెడ్డి రామారావు, నల్లకాంతం తిరుపతిరావు, గంట అప్పలస్వామి, గంట సింహాచలం తదితరులను జ్ఞాపికలతో సత్కరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!