
వరుపుల సత్య ప్రభ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర…
శంఖవరం (అఖండభూమి) కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మ్యానిఫెస్టో ప్రచారం లో భాగంగా భవిష్యత్ కు గ్యారంటీ పేరిట టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గం లో కొనసాగింది….ప్రచార రధం అయిన బస్సు , సుమారు 150 కార్లతో ఏలేశ్వరం మండలం ఎర్రవరం నుండి ర్యాలీగా శరభ వరం వరకు ఈ యాత్ర కొనసాగింది… ముందుగా ఎర్రవరం లో స్థానిక అభయ ఆంజనేయ స్వామి ఆలయం లో జిల్లా టీడీపీ నాయకులు తో కలిసి సత్య ప్రభ రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు….ఈ యాత్ర ఎర్రవరం లో ప్రారంభం అయ్యే సమయంలో భారీ వర్షం రావడం తో టీడీపీ శ్రేణులు కలవర పడ్డాయి…అయితే కొద్దిగా వర్షం తగ్గు ముఖం పట్టడంతో నియోజకవర్గ టీడీపి ఇంచార్జ్ వరుపుల సత్య ప్రభ రాజా జిల్లా టీడీపీ నాయకులు తో కలిసి జెండా ఊపి బస్సు ప్రచార యాత్ర ప్రారంభించారు…ఈ యాత్రలో భాగంగా సిరిపురం, చిన శంకర్ల పూడి, ఉత్తరకంచి గ్రామాలలో స్థానిక నాయకులు తో కలిసి అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలు కి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.,లంపక లోవ వినాయక ఆలయం లో స్థానిక టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 14 కోట్ల రూపాయలు తో టీడీపీ హయాంలో అభివృద్ధి చేసిన ఒమ్మంగి, ఉత్తరకంచి రోడ్డు సెల్ఫీ, అధ్వాన్నంగా గుంతలు తో ఉన్న శరభ వరం, ఒమ్మంగి రోడ్డు..ప్రారంభం కానీ శరభ వరం రైతు భరోసా కేంద్రం… తుప్పలు మొలిచి నిరూపయోగం గా ఉన్న జగన్ ఇండ్ల స్థలాలు సెల్ఫీ లు జిల్లా టీడీపీ నాయకులు తో కలిసి సత్య ప్రభ రాజా తీసుకొన్నారు..అనంతరం శరభవరం లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


