మన్యంవీరుడు,విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు….
శంఖవరం :(అఖండభూమి) మండలం కేంద్రమైన శంఖవరం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల మన్యంవీరుడు విప్లవ యోధుడు స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారు 126వ జయంతిని శంఖవరం గ్రామానికి చెందిన యువకులు,ప్రజలు ఘనంగా నిర్వహించారు.ముందుగా అల్లూరి సీతారామరాజు గారికి పలువురు యువకులు,ప్రజలు పూలమాలలతో అల్లూరిసీతారామరాజు గారి విగ్రహాన్ని సత్కరించి ఆయనకి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు మన్యపు ప్రాంతానికి,మైదాన ప్రాంతానికి చేసిన సేవలను కొనియాడారు. బ్రిటిష్ వారిపై అగ్నిజ్వాలాంటి
పోరాటంతో భారతీయులకు
ఆత్మస్థైర్యం కల్పించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి తన వంతు సహకారం అందించారని,అతి చిన్న వయసులో తన 24 ఏటే విప్లవ ఉద్యమాన్ని స్థాపించి చిన్న వయసులోనే బ్రిటిష్ వారి తూటాలకు బలికావడం భారతీయుల దురదృష్టంగా భావించారు.అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి యువకుడు కూడా దేశభక్తి కల్గి ఉండాలని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా యువకులు స్వీట్లు చేశారు.ఈ కార్యక్రమంలో పిల్లా గంగాధర్ రావు, మురాలశెట్టి అబ్బాయి, బోనం లోవరాజు,గండ్రేటి వెంకటేష్ ,కర్రి అశోక్ గారు,సగిరెడ్డి బాబి , ములగపల్లి చిన్న ,గండ్రేటి సాయిదుర్గ ,మేకల సత్యశ్ర్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.


