మా రోడ్డు బాగు చెయ్యండి సారు అంటున్న రైతులు
రంగంపేట… అఖండభూమి
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగం పేట మండలం రంగం పేట నుండి గండేపల్లి వెళ్లే రహదారి పూర్తి బురద గా మారడం తో రైతులు అందరూ ఎన్ని సారులు అధికారులు కీ నాయకులు కీ మా రోడ్డు బాగు చెయ్యండి సారు అంటున్న పట్టించుకొనే వారు లేరు అని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..2020నుండి ఈ రోడ్డు ఇదే విధంగా ఉంది అని ఇప్పటికి మార్పు రాకపోవడం తో విసుగు చెందిన రైతులు తాము అందరూ కలిసి చందాలు వేసుకొని తాత్కాలికము ప్రస్తుతం రోడ్డు కీ మట్టి వేసుకొనే కార్యక్రమం చేపట్టారు.. ఇది చూసిన వారు ప్రజలు సమస్యలు పై స్పందించాలిసిన వారు ముందు కు రాకపోవడం తో పొలాలు కీ వెళ్లే వారు అటు గా గండేపల్లి వెళ్లే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడడం చూసి రైతులు తీసుకొన్న నిర్ణయం చాలామంచిది అని ఇప్పటికి అయినా ప్రభుత్వం ముందు కీ వచ్చి రైతులు సమస్య లు పరిష్కారం చెయ్యాలి అని కోరుతున్నారు



