ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

 

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

బిక్కవోలు. అఖండ భూమి

మన్యం వీరుడు స్వాతంత్ర సమర యోధుడు, భరతమాత ముద్దు బిడ్డ బ్రిటిష్ సామారాజ్యాన్నికీ వణుకు పుట్టించిన వీరుడు

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగాఈ రోజు బిక్కవోలు మండలం రంగాపురం, రంగంపేట మండలం కోటపాడు గ్రామాలలో బీజేపి ఆద్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. దీనిలో బీజేపి నియోజక వర్గ కన్వీనర్ శివరామకష్ణoరాజు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుల ను స్మరిస్తూ ఆ వీర గాధలను అందరికీ తెలియజేయడమే భాగంగా ఆజాధి క అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా బీజేపి కార్యక్రమాలు చేపట్టిందని దానిలో భాగంగా గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమo నిర్వహించామని, ఇకపై ప్రతీ సంవత్సరం నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమo లో రంగంపేట మండల అధ్యక్షులు సాయిరాం, ఉపాధ్యక్షులు సూర్యభాస్కర రావు, మహిళా మర్చా అధ్యక్షురాలు గాయత్రి, సీనియర్ నాయకులు గుప్తా, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!