గృహనిర్మాణ నిధులు దారిమళ్లింపు.. వైకాపా సర్కారుపై కేంద్రం ఆగ్రహం..

 

Amaravati: గృహనిర్మాణ నిధులు దారిమళ్లింపు.. వైకాపా సర్కారుపై కేంద్రం ఆగ్రహం..

అమరావతి: గృహ నిర్మాణ నిధులు దారిమళ్లించిన వైకాపా సర్కారుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవోకూడా లేకుండా రూ.1,039 కోట్ల నిధులు దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది..

తక్షణమే సింగిల్‌ నోడల్‌ ఖాతాకు ఆ నిధులు రీయింబర్స్‌ చేయాలని ఆదేశించింది. పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు విడుదల చేసింది. ఉమ్మడిగా నిర్వహించే సింగిల్‌ నోడల్‌ ఖాతాలో రూ.కోటిన్నర మాత్రమే నిధులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,174 కోట్లు నిలిపివేసింది. ఇదే సమయంలో రూ.42.71 కోట్ల పెండింగ్‌ బిల్లులు పేరుకుపోవడంతో 211 లే అవుట్లలో నీటి సరఫరా పనులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలన్నింటితో రాష్ట్రంలోని 2.34 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జాప్యమవుతున్నాయి..

Akhand Bhoomi News

error: Content is protected !!