Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటలు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భారీగా భక్తులు పొటెత్తారు. గత రెండు రోజులుగా సెలవులు కావడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
దీంతో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్లలో భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి వైకుంఠంలోని 24 కాంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి ఉచిత సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తితిదే వెల్లడించింది.



