Train Schedule: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు
విశాఖపట్నం(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
నెల 10 నుంచి 16 వరకు గుంటూరు-విశాఖ(17239), 11 నుంచి 17 వరకు విశాఖ-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, 10 నుంచి 16 వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ (17267-17268), రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (07466-07467) రైళ్లను రద్దుచేసినట్లు ప్రకటించారు.
ఈరోజు 10,11, 14, 15 తేదీల్లో ధన్‌బాద్-అళప్పుజ (13351) బొకారో, 11న హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (12835), 14న టాటానగర్-ఎస్‌ఎంవీ బెంగళూరు (12889), 15న హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (18637) రైళ్లను వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారిమళ్లించి నడపనున్నట్లు వెల్లడించారు.



