మన భవిష్యత్తు-మన గ్యారెంటీ- మనసైకిల్ ఇదే మన నినాదం..
కోటనందూరు అఖండ భూమి వెబ్ సైట్
మన భవిష్యత్తు మన గ్యారెంటీ మనసైకిల్ ఇదే మన నినాదం అని తుని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా, కోటనందూరు మండలం పాత కొట్టం పంచాయతీ పరిధిలో నాలుగవ రోజు మండల పార్టీ అధ్యక్షుడు గాడి రాజబాబు నాయకత్వంలో రాష్ట్ర టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ముఖ్యఅతిథిగా రాగా మన భవిష్యత్తుకు గ్యారంటీ – మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగినది. గ్రామ ప్రజలు యనమల దివ్య ను పూల హారతులతో స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు మొత్తం ఈమె వెంట నడిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన భవిష్యత్తుపై నమ్మకం కలగడానికి సూపర్ సిక్స్ పథకాలు గురించి ఇంటింటికి ప్రసారం చేస్తున్నామని తెలియజేశారు.
కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణణ్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యం, దుర్మార్గ పాలన చేస్తుందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రైతులకు మద్దతు ధర లేదని, యువతకు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని గురించి పట్టించుకోలేదని, దాచుకోవడం దోచుకోవడం తప్ప చేసింది శూన్యమని, రాబోయే ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
జిల్లా మైనార్టీ నాయకులు షేక్ నవాబ్ జానీ మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారం చేపట్టిన మొదటి రోజులలో కొట్టం గ్రామ దళితులకు స్థలాలు ఇచ్చే కాలనీ కట్టి న సందర్భముగా జాతీయస్థాయిలో ఈ గ్రామానికి గుర్తింపు వచ్చిందని, ఈరోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, అలాగే దళితుల యొక్క 27 పథకాలు రద్దుచేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని, దళితులకు జరిగిన అవమానం ఏ రాష్ట్రంలో కూడా లేదని, దళితులు పూర్తిగా మారిపోయి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి చూస్తున్నారని, కొట్టం పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామాలలో నాలుగు రోజులు పాటు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సుర్ల లోవరాజు, మోటుకూరి వెంకటేష్, అంకం రెడ్డి రమేష్, చిరంజీవి రాజు ,అంకంరెడ్డి బుల్లిబాబు, బోడపాటి సత్యనారాయణ, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



