Road Accident : ఘోర బస్సు ప్రమాదం.. పెళ్లింట విషాదం.. ఏడుగురు మృతి
ప్రకాశం జిల్లా దర్శిలో.. అర్థరాత్రి బస్సు సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో.. ఏడుగురు చనిపోయారు..
మరో 30 మంది గాయపడ్డారు. వారంతా పొదిలికి చెందిన వారని తెలిసింది.
పెళ్లి బృందం వారు పొదిలి నుంచి.. అద్దెకు తీసుకున్న ఆర్టీసీ బస్సులో కాకినాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో పెళ్లింట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
బస్సు చాలా వేగంగా కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



