గిరిజన ప్రాంతంలో మనసున్న మాదిగ పల్లెను పలకారిద్దాం రండి

 

గిరిజన ప్రాంతంలో మనసున్న మాదిగ పల్లెను పలకారిద్దాం రండి

స్థానిక మాదిగల డిమాండ్లపై సానుకూల స్పందన

అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి అఖండ భూమి రాజవొమ్మంగి మండల కేంద్రంలో జగనన్న ప్రవేశ పెట్టిన”మనసున్న మాదిగ పల్లెను పలకరిద్దాం రండి”కార్యక్రమం సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కే.కనకారావు,రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదనరావు,దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.పిచ్చయ్య,మండల మాదిగ సంఘ సభ్యులు పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల బాధలను అర్థం చేసుకొని అడగకుండానే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు,ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకుడు మోర్త బుజ్జి గిరిజన ప్రాంతంలో ఉన్న మాదిగలనురెల్లి కులస్తులను ఎస్టీలుగా గుర్తింపునిచ్చి వారికి విద్య,వైద్య,గృహ సదుపాయములను పూర్తిస్థాయిలో కల్పించే విధంగా వారి యొక్క సమస్యలను సీఎం జగన్మోహన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయమని డిమాండ్ చేయగా వారు సానుకూలంగా స్పందించి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల మాదిగ సంఘం ప్రెసిడెంట్ మోర్తా బుజ్జి,సభ్యులు కిరణ్ లోవరాజు,కామరాజు,జీవ,తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!