వైసిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట.
ఆలమూరులో జరిగిన గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చిర్ల.
ఆలమూరు (అఖండ భూమి):వైసిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కొత్తపేట శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆలమూరులో ఆదివారం వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల పాల్గొన్నారు.ముందుగా చల్లా వారి వీధి పొడవునా మహిళలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి పూలాభిషేకంతో ఆహ్వానం పలకగా ఎమ్మెల్యే చిర్లను డాక్టర్ చల్లా గజమాలతో సన్మానించారు.అనంతరం చిర్ల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.సంక్షేమ పథకాల లబ్ధి వివరాలతో కూడిన పత్రాలను అందజేశారు.సమస్యల పరిష్కారం దిశగా అధికారులు ముందుకు సాగాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా నవరత్నాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.మాట తప్పని మడమ తిప్పని నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.అనంతరం డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు స్థానిక యువతకి 20 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన క్రికెట్ కిట్లను ఎమ్మెల్యే చిర్ల చేతులు మీదుగా అందజేశారు.గత ప్రభుత్వానికి,తమ ప్రభుత్వానికి ఉన్న తేడాలను వివరించి,మళ్లీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే చిర్ల ప్రజలను కోరారు.ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ నియోజకవర్గంలో ప్రజలకు కచ్చితంగా చేరినందునే ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నామన్నారు.గ్రామంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తంచేస్తున్నారన్నారు.ఒక్కో ఇంటికి సుమారు రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షల వరకు వివిధ పథకాల కింద ఆర్థికసాయం అందిందన్నారు.అలాగే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల విలువ చేసే ఇళ్ల స్థలాలు అందాయని,రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలనీగా ఆలమూరు ఎర్రకాలనీ తయారైందని,ఇంతగా లబ్ధి చేకూర్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.అలాగే ఆలమూరు గ్రామంలోని సచివాలయం1&2 పరిధిలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా బీసీ సామాజిక వర్గ లబ్ధిదారులకు 18 కోట్ల 97 లక్షల 54 వేల 368 రూపాయలు,ఎస్సి సామాజిక వర్గ లబ్ధిదారులకు 7 కోట్ల 65 లక్షల 41 వేల 637 రూపాయలు,ఎస్టీ సామాజిక వర్గ లబ్ధిదారులకు 1 కోటి 36 లక్షల 11 వేల 446 రూపాయలు,మైనారిటీ సామాజిక వర్గ లబ్ధిదారులకు 97 లక్షల 12 వేల 230 రూపాయలు,కాపు సామాజికవర్గ లబ్ధిదారులకు 10 కోట్ల 2 లక్షల 45 వేల 976 రూపాయలు,ఇతర సామాజిక వర్గాల లబ్ధిదారులకు 6 కోట్ల 15 లక్షల 69 వేల 290 రూపాయలు
కలిపి మొత్తం 45 కోట్ల 14 లక్షల 34 వేల 947 రూపాయలు లబ్ది చేకూర్చడం జరిగింది అని ఎమ్మెల్యే చిర్ల తెలియజేసారు.అనంతరం ఆలమూరు గ్రామంలో వై.యస్.ఆర్.సి.పి.కార్యకర్త సెంథిల్ కుమార్ నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కర్రి నాగిరెడ్డి,వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్,వైస్ ఎంపీపీ వాసంశెట్టి దుర్గా భవాని,రావులపాలెం జెడ్పీటీసి కుడుపూడి శ్రీను,ఎంపీటీసి వున్నమట్ల విజయ కుమారి,తాసిల్దారు ఐపి శెట్టి,వైసిపి ఆలమూరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రావాడ సత్తిబాబు,వైసిపి నాయకులు ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి(దొరబాబు),నాండ్ర నాగమోహన్ రెడ్డి,తోరాటి రాంబాబు,చల్లా నానాజీ,చల్లా భూషణం,రామానుజుల నాగేశ్వర్రావు,అనుసూరి దుర్గ,లంకె వెంకటరెడ్డి,వనుం జార్జి బాబు,కుడిపూడి లోవ,డిపి రావు,కోపనాతి శ్రీనివాస్,జొన్నాడ అబ్బు,దొమ్మేటి అర్జునరావు,రావూరి శివ,ఎలుబండి బూరయ్య,ఎరుకొండ గణేష్,తాకాసి సత్తిబాబు,మద్దా మోహన్ రావు,గొల్లపల్లి కిరణ్,సుంకర కామరాజు,చల్లా ఫాలోవర్స్,వైసిపి నాయకులు కార్యకర్తలు,గృహసారధులు,వివిధ శాఖల అధికారులు,సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.



